
సాక్షి, హైదరాబాద్: ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. ఆ సంస్థకు చెందిన 130 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్ విక్రయాలకు పాల్పడిందని నిర్ధారణ కావడంతో ఈడీ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో (సీసీఎస్) కేసు నమోదైవుంది. దీనికి అనుబంధంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. కాగా, గతంలో ఇదే కేసుకు సంబంధించి 82.11 కోట్ల విలువైన 145 కేజీల బంగారాన్ని ఈడీ సీజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment