పాఠశాలలోని ఉపాధ్యాయులకు యాప్ గురించి వివరిస్తున్న ప్రతినిధులు
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాల అయినా కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు, విద్యాబోధన అందుతున్న సిద్దిపేటలోని ఇందిరానగర్ జెడ్పీ హైస్కూల్‌లో మరో సరికొత్త సదుపాయమూ అందుబాటులోకి వస్తోంది. పాఠశాలలోని విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంపొందించేందుకు ప్రత్యేక యాప్‌తో సేవలు అందనున్నాయి. జియో ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఎంబైబ్ డిజిటల్ లెర్నింగ్’ యాప్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంది రానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో వినియోగించను న్నారు.
విద్యార్థి ఏ స్థాయిలో విద్యను అభ్యసిస్తు న్నాడు? ఏ విషయంలో మెరుగుపడాల్సి ఉందనే అంశాలను ఈ యాప్ సాయంతో గుర్తించవచ్చు. విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టి.. అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు వీలవుతుంది.
దేశంలో 40 ప్రభుత్వ పాఠశాలల్లో..
గతేడాది దేశవ్యాప్తంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యా యులుగా అవార్డు అందుకున్న టీచర్లు పనిచేస్తున్న 40 ప్రభుత్వ పాఠశాలలకు ఈ యాప్ ను ఉచితంగా అందించేందుకు జియో సంస్థ ముందుకు వచ్చింది. అందులో భాగంగానే సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ఎంపికైంది. ఈ యాప్ వినియోగానికి సంబంధించి ఈ పాఠశాల ఉపాధ్యా యులకు శిక్షణ ఇచ్చారు.
మరో వారం రోజుల్లో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 23 సెక్షన్‌లలో 1,212 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 90% పిల్లల తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. వారందరికీ కొత్త యాప్‌తో ప్రయోజనం కలుగు తుందంటున్నారు.
‘ఎంబైబ్’ యాప్ పనితీరు, ప్రయోజనాలివీ..
ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు లాగిన్ అవకాశం ఉంటుంది. అందరినీ సమ న్వయం చేసేందుకు, పర్యవేక్షించేందుకు హెచ్‌ఎం/ప్రిన్సిపాల్‌కు కూడా అడ్మిన్ లాగిన్ ఉంటుంది. ప్రతిరోజూ చెప్పిన సబ్జెక్టులు, హోంవర్క్, ప్రశ్నలను ఉపాధ్యాయులు ఈ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. యాప్‌లోనే సబ్జెక్టుల వారీగా వీడియోలు, యానిమేషన్లు ఉంటాయి.
►విద్యార్థులు ఇంటికి వెళ్లాక పాఠాలను మళ్లీ చదువుకోవచ్చు. చదివిన తర్వాత యాప్‌లో ఆ పాఠానికి సంబంధించి చిన్నచిన్న ప్రశ్నలు వస్తాయి. అందులోనే సమాధానాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా విద్యార్థులకు ఎంత మేర పాఠం అర్థమైందనేది ఉపాధ్యాయులు గ్రహిస్తారు. సందేహాలను నివృత్తి చేస్తారు. విద్యార్థి ఎంత సమయంలో చదవడం పూర్తి చేశారు? యాప్ ఆన్ చేసి పక్కన పెట్టేశారా అన్నదీ గమనించ వచ్చు.
►ఈ యాప్ విద్యార్థుల అభ్యసన స్థాయిని ట్రాక్ చేసి, కృత్రిమ మేధ సాయంతో సమీక్షిస్తుంది. విద్యార్థికి అవసరమైన ఇన్‌పుట్స్‌ను సూచిస్తుం ది. వాటికి అనుగుణంగా ఉపాధ్యాయులు సదరు విద్యార్థులపై శ్రద్ధ పెడతారు. అవసరా న్ని బట్టి ఆన్‌లైన్, ప్రత్యక్ష బోధన చేస్తారు.
►విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ యాప్ ద్వారా పిల్లలు ఏం చదువుతున్నారు? ఎంత మేర అవగాహన పొందుతున్నారన్నది తెలుసు కోవచ్చు. యాప్ ద్వారానే అవసరమైన సలహాలు, సూచనలు చేయవచ్చు.
►ఈ యాప్ వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులపై ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్‌లకు పర్యవేక్షణ మరింత సులువు అవుతుంది.
మెరుగైన విద్య అందించే లక్ష్యంతో..
విద్యార్థులకు మెరుగైన విద్య అందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మంత్రి హరీశ్‌రావు సహకారంతో మా పాఠశాల కార్పొరేట్ స్థాయికి చేరింది. ఎంబైబ్ డిజిటల్ లెర్నింగ్ యాప్ వినియోగానికి మా పాఠశాల ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఆ యాప్ విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుంది. అలాంటిది ఉచితంగా అందజేయనున్నారు. మా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగితే.. చదువు చెప్పిన మాకు సంతోషంగా ఉంటుంది.
– రామస్వామి, ప్రధానోపాధ్యాయుడు, (జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత)
Comments
Please login to add a commentAdd a comment