
విగ్నేష్, అతని చెల్లెలు
సాక్షి,న్యాల్‌కల్(సంగారెడ్డి): తల్లి దశదిన కర్మ రోజే తండ్రి చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. పది రోజుల వ్యవధిలో ఇద్దరూ అనారోగ్యంతోనే మరణించారు. కళ్ల ముందే తల్లిదండ్రుల మరణాన్ని చూసిన చిన్నారులు ఏం చేయాలో తెలియక అంత్యక్రియలకు వచ్చిన వారిని చూస్తుండటంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని అమీరాబాద్ గ్రామానికి చెందిన మా రుతి రావు, భార్య స్వప్నకుమారి దంపతులకు ఇద్దరు సంతానం.
ఇద్దరూ కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో స్వప్నకుమారి ఈనెల 26న మృతి చెందింది. ఆదివారం మృతిరాలి దశదిన కర్మ చేస్తున్న క్రమంలో భర్త మారుతిరావు రక్తం కక్కుకొని మృతి చెందాడు. ఇద్దరి మరణంతో వారి కుమారుడు విగ్నేష్(8), కూతురు రమ్య(4) అనాథలుగా మారారు. అంత్యక్రియలకు వచ్చిన వారు చిన్నారులను చూసి కంటతడి పెట్టారు. అనాథలుగా మారిన చిన్నరులను మనసున్న మహారాజులు, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నారులు వారి బాబాయి వద్ద ఉన్నారు.
చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో భర్త నిద్రపోతుంటే ప్రియుడితో కలిసి..
Comments
Please login to add a commentAdd a comment