సాక్షి, మరిపెడ (వరంగల్): దండం పెడతాం.. సాగు చేసుకుంటున్న మా భూములను లాక్కోవద్దు... అంటూ మియావాకీ ఫారెస్ట్ పనుల ప్రారంభానికి వచ్చిన అధికారుల కాళ్లపై పడి రైతులు వేడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. చిన్నగూడూరు శివారు సర్వే నంబర్ 68లోని 10 ఎకరాల భూమిలో చిన్నగూడూరు, శివారు జబ్బితండాకు చెందిన సుమారు 10 మంది రైతులకు లావనీ పట్టాలు ఉన్నాయి.
ఇదే స్థలంలో మియావాకీ(చిట్టడవి) విధానంలో మొక్కలు నాటేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. పనుల ప్రారంభ కార్యక్రమానికి శనివారం చిన్నగూడూరు ఎంపీడీఓ సరస్వతి, తహసీల్దార్ పూల్లారావు, సర్పంచ్ కొమ్ము మల్లయ్య రాగా, అక్కడకు రైతులు చేరుకుని అడ్డుకున్నారు. తామంతా నిరుపేదలమని, భూములు బలవంతంగా తీసుకుని పొట్ట కొట్టొద్దని కోరుతూ ఎంపీడీఓ కాళ్లపై పడి వేడుకుకున్నారు. దీంతో అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెబుతూ వెనక్కి వెళ్లిపోయారు.
చదవండి: ఈటల ‘లేఖ’ నిజమే!
Comments
Please login to add a commentAdd a comment