
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టిగణపతినే పూజిద్దాం! పర్యావరణాన్ని కాపాడుకుందాం!!కరోనా నిబంధనలు పాటిద్దాం! మనల్ని మనం కాపాడుకుందాం!!
సాక్షి, హైదరాబాద్: మనమంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న బొజ్జ గణపయ్యను కొలిచే శుభతరుణం వచ్చేసింది. ముక్కోటి దేవతల్లో తొలి పూజలు అందుకొనే ఆది దేవుడు విఘ్ననాయకుడిని భక్తి శ్రద్దలతో కొలుచుకునే శుభదినం ఈరోజు. తరతమ భేదాలు లేకుండా కలిసికట్టుగా నిర్వహించుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో గణపతి బప్పా మోరియా మంగళ మూర్తి మోరియా నినాదాలు మారు మోగుతాయి. అయితే మనమందరం కొన్ని సంగతులను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ( మహాకాయ.. అభయమీయవయా!)
మట్టిగణపతినే పూజిద్దాం! పర్యావరణాన్ని కాపాడుకుందాం!!
కరోనా నిబంధనలు పాటిద్దాం! మనల్ని మనం కాపాడుకుందాం!!
దయచేసి ప్రసాదాలను, ఇతర ఆహారాన్ని వృధా చేయకండి!
గుప్పెడు మెతుకులు కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారికి దానం చేయండి!!
మా ప్రియమైన పాఠకులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు!!
చదవండి : Ganesh Chaturthi: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే..