సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా పాక్షిక సామూహిక రోగ నిరోధక శక్తి (పార్షియల్ హెర్డ్ ఇమ్యూనిటీ) వచ్చిందా..? అందువల్లే కరోనా వ్యాప్తి, దాని ఉధృతి తగ్గుముఖం పట్టిందా..? అంటే అవుననే అంటున్నాయి వైద్య వర్గాలు.. దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గింది. ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్యా అదే స్థాయిలో తగ్గింది. దాదాపు 90 శాతం కరోనా పడకలు ఖాళీగా ఉంటున్నాయి. ఇది మంచి పరిణామం.. ఈ పాక్షిక సామూహిక రోగనిరోధక శక్తికి తోడు, అవసరమైన వారికి వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే పూర్తి స్థాయి హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ సెకండ్ వేవ్ వచి్చనా మనపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని చెబుతున్నారు. మే నెలతో పోలిస్తే ఆగస్టు నాటికి దేశంలో పది రెట్ల కేసులు పెరిగాయి. జనాభాలో ఎక్కువ మందికి కోవిడ్ సోకింది. అందువల్ల సామూహిక రోగనిరోధక శక్తి పాక్షికంగా వచ్చిందని అంటున్నారు. చదవండి: వారియర్స్‌కు వ్యాక్సిన్... అక్కర్లేదు
దేశంలో ఆగస్టు నాటికే 7 శాతం మందికి కరోనా సోకిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. పదేళ్లు పైబడిన 7.43 కోట్ల భారతీయులకు ఈ ఏడాది ఆగస్టు నాటికే వైరస్ సోకిందని సీరో సర్వేలో వెల్లడించింది. రోగ నిరోధకశక్తి అధికంగా ఉండటంతో అధిక శాతం మందిలో లక్షణాలు బయటపడలేదని తెలిపింది. భారత్‌లో దాదాపు 50 శాతం మంది కి వ్యాధి సోకనుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అధ్యయనం ఇటీవల లాన్సె ట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైంది. జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల గ్రామాలతో పోలిస్తే నగర జనాభాకు వైరస్ అధికంగా సోకిందని పే ర్కొంది. ముఖ్యంగా మురికివాడల్లో ఉండే అనేక మంది ఆగస్టు నాటికే వ్యా ధి బారిన పడ్డారని వెల్లడించింది. చదవండి: ఒకే రోజు 3 వేలకు పైగా మరణాలు
‘భారత్‌లో ఈ ఆగస్టు నాటికే పదేళ్లు దాటిన ప్రతి 15 మందిలో ఒకరికి కోవిడ్ సోకింది. మే నుంచి ఆగస్టు వరకు మధ్య వయస్కుల్లో వ్యాప్తి తీవ్రత పదింతలు పెరిగింది. కానీ లక్షణాలు బయటపడలేదు’అని వివరించింది. యాంటీబాడీలు ఉండటం వల్లనే ప్రతి 10 మందిలో 9 మందికి కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడం లేదంది. జాతీ య సగటు కంటే తెలంగాణలో సీరో ప్రివలెన్స్ రెట్టింపు గా ఉంది. సెపె్టంబ ర్ నాటికే అది 12% గా ఉంది. అంటే ప్రతి 8 మంది లో ఒకరికి అప్పటికే వచి్చందని వైద్య నిపుణులు అంచనా వేశారు. అక్టోబర్, నవంబర్ నెలలు కలిపితే వైర స్ వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
లక్షణాలు లేనివారే 97 శాతం..
దేశంలో ఏప్రిల్ చివరి నాటికి కరోనా సోకిన 68 శాతం మందిలో లక్షణాలుంటే, 32 శాతం మంది లక్షణాలు లేనివారున్నారు. ఇప్పుడు లక్షణాలు లేనివారు 97 శాతం ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. అంటే కేవలం మూడు శాతం మందికే లక్షణాలున్నాయి. సెపె్టంబర్ చివరి నాటికి కేసులు రెండింతలు కావడానికి 28 రోజులు పట్టింది. అదే పద్ధతిలో ఇన్ఫెక్షన్ కొనసాగితే, డిసెంబర్ నాటికి హెర్డ్ ఇమ్యూనిటీకి చేరుకుంటుందని ఐసీఎంఆర్ రిపోర్టులో చెప్పింది. కానీ ఆ తర్వాత కేసులు పెరగలేదు కాబట్టి పాక్షికంగా హెర్డ్ ఇమ్యూనిటీకి చేరుకోగలిగామని నిపుణులు చెబుతున్నారు. దేశంలో లక్షణాలున్న వారికే టెస్టులు చేస్తున్నారు. లక్షణాలు లేనివారికి చేయడం లేదు. కాబట్టి కేసులు బయటకు రావడంలేదని అంటున్నారు. లక్షణాలు లేకుండా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. పైగా మొదట్లో ఉన్నట్లు కరోనా కేసులు సీరియస్‌గా ఉండటం లేదు.
ఆ దశకు ఇప్పటికే చేరుకున్నాం..
రాష్ట్రంలో ప్రతి 8 మందిలో ఒకరికి ఇప్పటికే కరోనా సోకింది. గత రెండు నెలల కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఇంకా చాలా మందికి కరోనా వచ్చి ఉండవచ్చు. లక్షణాలు లేకుండా చాలా మందికి వైరస్ సోకుతోంది. ఇలా వైరస్ వ్యాప్తి బయటకు తెలియకుండానే జరిగిపోతోంది. ఐసీఎంఆర్ అంచనా నిజమైతే పాక్షిక హెర్డ్ ఇమ్యూనిటీ దశను మనం ఇప్పటికే చేరుకొని ఉండవచ్చు. అందుకేనేమో ప్రపంచం మొత్తం ప్రభావం చూపిన సెకెండ్ వేవ్ మన దేశంలో లేదు. పైగా మన దేశంలో కేసులు తిరోగమనంలో ఉన్నాయి. గత వారంతో పోలిస్తే మన దేశంలో కేసులు 14 శాతం చొప్పున తగ్గితే, తెలంగాణలో 24 శాతం చొప్పున తగ్గుతున్నాయి. కాబట్టి వ్యాక్సిన్ పంపిణీలో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment