హైదరాబాద్: ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు మెట్రో ఫేజ్– 2పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాగోల్, ఎల్‌బీనగర్, ఎంజీబీఎస్, ఫలక్‌నుమా మార్గాల్లో చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు చేపట్టనున్న రూట్‌లో చాంద్రాయణగుట్ట వద్ద ఇంటర్‌చేంజ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కొత్త ఎయిర్‌పోర్ట్ రూట్, చాంద్రాయణగుట్ట ఇంటర్‌చేంజ్ స్టేషన్‌పై ఆదివారం మెట్రో భవన్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మేధోమథన సమావేశంలో ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు, కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల ప్రకారం.. నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు మెట్రోను పొడిగించి అక్కడి నుంచి మైలార్‌దేవ్‌పల్లి మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఈ మార్గంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద కొత్తగా హైకోర్టు భవనం అందుబాటులోకి రానున్న దృష్ట్యా మైలార్‌దేవ్‌పల్లి నుంచి నూతన హైకోర్టు భవనం మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఎనీ్వఎస్ రెడ్డి అధికారులకు సూచించారు. మెట్రోస్టేషన్‌లు, డిపోల ఏర్పాటు, ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్, సిగ్నలింగ్ వ్యవస్థ, తదితర సాంకేతిక అంశాలు, ప్రయాణికుల లగేజీ తనిఖీలు, సెక్యూరిటీ చెకింగ్‌లు వంటి అంశాలను సైతం సమగ్రంగా చర్చించారు.
సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్)ను సిద్ధం చేయాలని చెప్పారు. అమీర్‌పేట్ తరహాలో చాంద్రాయణగుట్ట వద్ద అతిపెద్ద ఇంటర్‌చేంజ్ స్టేషన్ అందుబాటులోకి రానున్న దృష్ట్యా దాని నిర్మాణంపై ప్రత్యేక అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, చీఫ్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజినీర్ ఎస్‌కె దాస్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్‌మెహన్, జనరల్ మేనేజర్లు ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, బీఎన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment