నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్న కేటీఆర్‌ కొడుకు హిమాన్షు | Kalvakuntla Himanshu Has IN charge Of Oakridge School Casnival | Sakshi
Sakshi News home page

మంత్రితో శభాష్‌ అనిపించుకున్న కేసీఆర్‌ మనవడు హిమాన్షు

Published Sat, Jan 28 2023 9:12 PM | Last Updated on Sat, Jan 28 2023 9:18 PM

Kalvakuntla Himanshu Has IN charge Of Oakridge School Casnival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓక్రిడ్జ్ స్కూల్ కాస్నివాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక, సామాజిక థృక్పథం థీంతో నిర్వహించిన కాస్నివాల్ (Casnival)కు  ఇంఛార్జీగా హిమాన్షు వ్యవహిరించాడు. ఈవెంట్‌లో భాగంగా ఏర్పాటుచేసిన 30కి పైగా స్టాల్స్‌తో  విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన కాస్నివాల్ ఈవెంట్‌లో ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలతో తమలోని ప్రతిభను చూపించారు. 

విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఈ కాస్నివాల్‌కు ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. కాస్నివాల్‌లోని స్టాల్స్ పరిశీలించారు. హిమాన్షు అతని స్నేహితుల సృజనాత్మకత, సామాజిక దృక్పథాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. నేటితరం పిల్లల ఆలోచన విధానానికి ఈ కాస్నివాల్ ప్రతీక అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి ఈవెంట్స్ విద్యార్థులకు ఇస్తాయన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగానే గవర్నమెంట్ స్కూల్స్ లోనూ పలు ఇన్నోవేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కాలం పిల్లల ఆలోచనలు అందుకోవడం తమ లాంటి వాళ్లకు ఎంతో కష్టమన్నారు. తాము రాష్ట్రాన్ని చదివితే ఈ పిల్లలు ప్రపంచాన్నే చదువుతున్నారని మెచ్చుకున్నారు. 

హైదరాబాద్‌లో మురికి కూపాలుగా మారిన చెరువులను పునరుద్దరించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ మనవడిగా సమాజానికి ఉపయోగపడే మంచి ఆలోచనలతో హిమాన్షు తన మిత్ర బృందంతో కలిసి పనిచేయడం సంతోషకరమని మెచ్చుకున్నారు. ఈ తరం పిల్లలు చదువుతో పాటు సామాజిక ఆలోచనలను అలవర్చుకుని మెరుగైన సమాజానికి బాటలు వేస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి యువతే దేశానికి, రాష్ట్రానికి అవసరం అన్నారు. కొత్త ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యం అవుతాయని చెప్పారు. కాస్నివాల్‌తో వచ్చే డబ్బులను నానక్ రాంగూడ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ కోసం ఇవ్వడం మంచి ఆలోచన అన్నారు. ఓక్రిడ్జ్ స్కూల్ పిల్లలు భవిష్యత్తులో రోల్ మోడల్‌గా నిలుస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఓక్రిడ్జ్ స్కూల్ క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ ప్రెసిడెంట్‌గా కాస్నివాల్ నిర్వహించిన హిమాన్షు మాట్లాడుతూ.. తమ కాస్నివాల్ ఈవెంట్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి లాంటిదన్నారు. తాను చదువుతో పాటు  సామాజిక సేవకూ సమ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. చదువుకుని మంచి మార్కులు సంపాదించినప్పుడు ఎంత సంతోషిస్తానో.. అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఎవరికైనా సాయం చేసినప్పుడు వాళ్ల ముఖంలో కనిపించే చిరునవ్వులో పొందుతానన్నారు. కాస్నివాల్‌తో సమకూరే డబ్బులతో నానక్ రాంగూడ చెరువును పునరుద్దరిస్తామన్నారు. ఆ ప్రయత్నంలో విజయవంతం అయిన రోజు ప్రపంచాన్నే గెలిచినంత గొప్పగా ఫీలవుతానన్నారు. తమ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. చెరువులను ఎలా పరిరక్షించాలనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, వారిని పర్యావరణ వేత్తలుగా మార్చడమే తమ మిత్ర బృందం లక్ష్యమన్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి కాస్నివాల్‌ను నిర్వహించాన్నారు. స్టాల్స్ నిర్వహణతో విద్యార్థులు యువ పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉందన్నారు. ఇక, ఓక్రిడ్జ్‌లో ఎంతో ఘనంగా నిర్వహించిన కాస్నివాల్ ఈ వెంట్‌లో సినీ హీరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరంలు సందడి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement