
సాక్షి, హైదరాబాద్: ఒక వాటర్ ఇయర్‌లో వినియోగించుకోలేని సాగునీటిని మరో ఏడాదిలో వినియోగానికి బదలాయించే (క్యారీ ఓవర్) అంశంపై కృష్ణా బోర్డు మరోమారు కేంద్రం తలుపు తట్టింది. గతేడాది కేటాయింపులున్నా, వినియోగించలేకపోయిన 51.21 టీఎంసీల నీటిని ఈ ఏడాది క్యారీ ఓవర్ చేయాలని కోరినా, ఈ విషయాన్ని బోర్డు పట్టించుకోవడం లేదని తెలంగాణ ఆక్షేపిస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించాల ని కృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు రెండ్రోజుల కిందట కృష్ణా బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. (చదవండి: నీటి వివాదాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం కసరత్తు)
బోర్డు తీరుపై అభ్యంతరం..
ఇప్పటికే క్యారీ ఓవర్ నీళ్లపై తెలంగాణ పలుమార్లు లేఖ రాయగా, దీనిపై బోర్డు చేతులెత్తేసింది. తెలంగాణ 2019–20 వాటర్ ఇయర్‌లో వాడుకోలేకపోయిన 51 టీఎంసీల నీళ్లను ప్రస్తుత సంవత్సరానికి బదలాయించడం సాధ్యం కాదంది. దీంతో బోర్డు తీరుపై తెలం గాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment