water usage
-
సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్ నీటి వినియోగంలో సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆర్ఎంసీ (జలాశయాల నిర్వహణ కమిటీ) తేల్చిచెప్పింది. రుతుపవనాల కాలంలో జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకూ ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 అడుగులకు పైనే ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వర్కింగ్ అరేంజ్మెంట్ ప్రకారం.. శ్రీశైలం వద్ద ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు చెరి సగం (50: 50) పంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు ఆర్ఎంసీ కన్వీనర్ ఆర్కే పిళ్లై తుది నివేదిక ఇచ్చారు. డిసెంబర్ 3న నిర్వహించిన ఆర్ఎంసీ ఆరో సమావేశంలో తుది నివేదికను రెండు రాష్ట్రాలు అంగీకరించినా.. దానిపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు డిసెంబర్ 5న ఏర్పాటుచేసిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారని, దీంతో ఆర్ఎంసీలో మిగతా సభ్యులైన నలుగురు (కన్వీనర్ ఆర్కే పిళ్లై, కృష్ణా బోర్డు సభ్యులు మౌతాంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్కో డైరెక్టర్ ఎమ్వీవీ సత్యనారాయణ) తుది నివేదికపై సంతకాలు చేశారని తెలిపారు. ఈ తుది నివేదికపై బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కృష్ణా బోర్డు ఆమోదించాకే ఆర్ఎంసీ నివేదిక అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 అవార్డు నోటిఫై అయ్యే దాకా ఈ నివేదిక అమల్లో ఉంటుందని తెలిపారు. ఆర్ఎంసీ తుది నివేదిక, సీడబ్ల్యూసీ రూల్ కర్వ్స్ ఆధారంగా నీటి కేటాయింపులకు రక్షణ కల్పి ంచాలంటూ రెండు రాష్ట్రాలు కేడబ్ల్యూడీటీ–2ను కోరడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఆర్ఎంసీ తుది నివేదికలో మరికొన్ని ప్రధానాంశాలు ఇవీ.. ►శ్రీశైలం జలాశయంలో 75 శాతం లభ్యత ప్రకారం రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాలి. ఆ తర్వాతే విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. ►శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ►ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల కంటే ఎగువన నీటిని నిల్వ చేయాలి. ►శ్రీశైలంకు వరద రోజుల్లో అంటే.. జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్య ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రోజూ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ మిలియన్ యూనిట్లలో లెక్కకట్టి.. దాన్ని ఇరు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలి. ►నాగార్జునసాగర్‌కు వరద రోజుల్లో అంటే.. జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్య రూల్ కర్వ్‌లో నిర్ణయించిన నీటి మట్టం కంటే ఎక్కువగా ఉంటే విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. రోజూ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ ఉత్పత్తయిన విద్యుత్‌ను లెక్కకట్టాలి. వరద తగ్గాక.. దిగువున సాగు, తాగునీటి అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తూ ప్రధాన కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేయాలి. ►నాగార్జునసాగర్ నిర్వహణ విధి విధానాలపై(రూల్ కర్వ్స్) రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) తెలియజేసి ఖరారు చేసుకోవాలి. మిగులు జలాలను కోటాలో కలపొద్దు.. ►ప్రతి సంవత్సరం రెండు రాష్ట్రాలు వినియోగించిన నీటిని రెండు విభాగాలుగా లెక్కించాలి. 75 శాతం లభ్యత ఆధారంగా ఏ రాష్ట్రం ఎంత వాడుకుంది.. ఎంత వాడుకోలేదు అన్నది లెక్కట్టాలి. మిగులు జలాలను ఏమేరకు మళ్లించారు అన్నది లెక్కకట్టాలి. ►వరద రోజుల్లో కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి జలాలు కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు ఎవరు ఏ మేరకు మళ్లించినా.. ఆ జలాలను మిగులు జలాలుగానే లెక్కకట్టాలి. ►జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను మూసివేసిన సమయంలో అంటే మిగు లు జలాలు లేని రోజుల్లో వాడుకున్న నీటిని ఆయా రాష్ట్రాల నికర జలాల కోటాలో కలపాలి. ►ఆర్ఎంసీ స్థానంలో జలాశయాల శాశ్వత నిర్వహణ కమిటీ(పీఆర్‌ఎంసీ) ఏర్పాటు చేసి.. ఉమ్మ డి జలాశయాల నిర్వహణను పర్యవేక్షించాలి. -
‘ప్రకాశం బ్యారేజ్‌ని కేఆర్ఎంబీ పార్టీ నుంచి డీనోటిఫై చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: 299 టీఎంసీల కోటా నుంచి తెలంగాణ అదనంగా నీరు వాడుకుందని, కేంద్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఆయన సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వరదజలాల వినియోగంపై కేంద్రం వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారుచేయాలని అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ని కేఆర్ఎంబీ పార్టీ నుంచి డీనోటిఫై చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. -
మీరే తేల్చండి: కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: ఒక వాటర్ ఇయర్లో వినియోగించుకోలేని సాగునీటిని మరో ఏడాదిలో వినియోగానికి బదలాయించే (క్యారీ ఓవర్) అంశంపై కృష్ణా బోర్డు మరోమారు కేంద్రం తలుపు తట్టింది. గతేడాది కేటాయింపులున్నా, వినియోగించలేకపోయిన 51.21 టీఎంసీల నీటిని ఈ ఏడాది క్యారీ ఓవర్ చేయాలని కోరినా, ఈ విషయాన్ని బోర్డు పట్టించుకోవడం లేదని తెలంగాణ ఆక్షేపిస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించాల ని కృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు రెండ్రోజుల కిందట కృష్ణా బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. (చదవండి: నీటి వివాదాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం కసరత్తు) బోర్డు తీరుపై అభ్యంతరం.. ఇప్పటికే క్యారీ ఓవర్ నీళ్లపై తెలంగాణ పలుమార్లు లేఖ రాయగా, దీనిపై బోర్డు చేతులెత్తేసింది. తెలంగాణ 2019–20 వాటర్ ఇయర్లో వాడుకోలేకపోయిన 51 టీఎంసీల నీళ్లను ప్రస్తుత సంవత్సరానికి బదలాయించడం సాధ్యం కాదంది. దీంతో బోర్డు తీరుపై తెలం గాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. -
పానీకి పట్టం
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ నేపథ్యంలో గ్రేటర్ సిటీజన్లు ఇళ్లకే పరిమితం కావడంతో నీటి వినియోగం అనూహ్యంగా పెరిగింది. వేసవి కావడం, ఇంట్లో ఉన్నా అధికంగా నీళ్లు తాగితేనే ఆరోగ్యానికి మంచిదని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచించడంతో నగరవాసులు ఇప్పుడు పానీకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మహానగర దాహార్తిని తీరుస్తున్న జలమండలి నగరంలో నిత్యం 2059 మిలియన్ లీటర్ల (205 కోట్ల లీటర్లు) తాగునీటిని సరఫరా చేస్తోంది. ఈ నీటిని సుమారు 10.60 లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తలసరిగా నిత్యం 135 లీటర్ల నీరు అవసరం. ఈ ప్రకారం పరిశీలిస్తే ప్రధాన నగరంలో నివసిస్తున్న వారికి ఈ ప్రమాణాల ప్రకారమే తాగునీరు సరఫరా అవుతోంది. ఇక శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి వ్యక్తికీ నిత్యం 100 లీటర్ల చొప్పున తాగునీరు సరఫరా అవుతోంది. నగరంలో పుట్టగొడుగుల్లా వెలసిన సుమారు రెండువేల ఫిల్టర్ ప్లాంట్ల వద్ద పీవీసీతో తయారు చేసిన వాటర్‌బాటిళ్లను సరిగా శుద్ధి చేయకుండానే నీటిని నింపేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. లాక్డౌన్ నేపథ్యంలో తనిఖీలు చేపట్టాల్సిన బల్దియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తదితర సంస్థలు తనిఖీలను గాలికొదిలేశాయి. మరోవైపు భూగర్భజలాలు వట్టిపోయిన శేరిలింగంపల్లి, చందానగర్, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ మాఫియా యథేచ్ఛగా దందా కొనసాగిస్తోంది. జలమండలి తాగునీటి సరఫరా ఇలా.. కోర్‌సిటీలో రోజు విడిచి రోజు.. శివార్లలో ప్రతి 3– 4 రోజులకోసారి తాగునీటిని జలమండలి సరఫరా చేస్తోంది. కోవిడ్ కలకలం నేపథ్యంలో కృష్ణా, గోదావరి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాలను శుద్ధిచేసే ఫిల్టర్ ప్లాంట్లు, నగరంలో శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసే 300కుపైగా ఉన్న స్టోరేజీ రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్, బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఈ విధుల్లో పాల్గొనే సిబ్బందికి బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ప్రత్యేక ప్రొటోకాల్ అమలు చేస్తున్నారు. నీటి శుద్ధి, నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ తాగునీరు సరఫరా అయ్యే ప్రాంతాల నుంచి ఐదు వేల నల్లా నీటి నమూనాలను సేకరించి ఐపీఎం, ఐహెచ్ఎస్, జలమండలి క్వాలిటీ విభాగం ఆధ్వర్యంలో పరీక్షిస్తున్నారు. కలుషిత జలాలపై ఫిర్యాదు అందిన వెంటనే సమస్య పరిష్కారమయ్యే వరకు ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు తాగునీరు అందిస్తుండడం విశేషం. వేసవి కార్యాచరణ ఇదే.. వేసవిలో తాగునీటి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండడంతో ప్రస్తుతం జలమండలికి ఉన్న వెయ్యి ట్యాంకర్లకు తోడు మరో 200 అదనపు ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లోపు నీటి సరఫరా జరగాలని ఎండీ ఆదేశించారు. శివారు ప్రాంతాల్లోనూ అదనపు నీటి ఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి మరో వంద ట్యాంకర్ల ద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తాగునీరందిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఫిల్టర్ ప్లాంట్లపై కొరవడిన నియంత్రణ.. గ్రేటర్ పరిధిలో వీధికొకటి చొప్పున సుమారు 5వేలకుపైగా ఫిల్టర్ ప్లాంట్లున్నాయి. వీటిలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందినవి 1000 మాత్రమే. మిగతా ప్లాంట్ల వద్ద పీవీసీతో తయారు చేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సక్రమంగా శుద్ధి చేయకుండానే తిరిగి నీటిని నింపి విక్రయిస్తున్నారు. మరోవైపు నీటిలో ఉన్న ఆవశ్యక లవణాలు, మినరల్స్‌ను తొలగించి బీఐఎస్ ప్రమాణాలను తుంగలోకి తొక్కుతున్నారు. ఈ నీటిని తాగినవారు తరచూ రోగాల పాలవుతున్నారు. ఫిల్టర్ ప్లాంట్ల నీటిని విధిగా కాచి వడబోసి తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫిల్టర్ ప్లాంట్ల ఆగడాలను కట్టడి చేయాల్సిన బల్దియా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విచ్చలవిడిగా తోడేస్తున్నా.. భూగర్భ జలాలు వట్టిపోయిన శేరిలింగంపల్లి, చందానగర్, నిజాంపేట్, కూకట్పల్లి తదితర శివారు ప్రాంతాల్లో ట్యాంకర్ మాఫియాలు వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నాయి. నీటికి డిమాండ్ పెరగడంతో 5 వేల లీటర్ల ట్యాంకర్‌కు డిమాండ్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ఒక్కో కుటుంబం ట్యాంకర్ నీళ్ల కోసం నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. చెరువులు, కుంటల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నా.. రెవెన్యూ యంత్రాంగం నిద్ర మత్తులో జోగుతుండడం గమనార్హం. -
నీటి వినియోగ లెక్కలేవీ..?
కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి వినియోగ లెక్కలు కోరిన కృష్ణా బోర్డు సంయుక్తంగా కాకున్నా ఒకరైనా పంపించాలని సూచన సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న నీటి వినియోగ లెక్కలు సమర్పించకపోవడంపై రాష్ట్రాన్ని కృష్ణా బోర్డు ప్రశ్నించింది. ప్రాజెక్టుల వద్ద సంయుక్త పర్యవేక్షణ జరిపి నీటి వినియోగ లెక్కలను ఎప్పటికప్పుడు పంపాలని కోరినా ఎందుకు చేయడం లేదని నిలదీసింది. ఈ మేరకు రాష్ట్రానికి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ మంగళవారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల్లో గుర్తించిన ప్రాంతాల్లో నీటి వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో ఇదివరకే సంయుక్త పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేశారని లేఖలో గుర్తుచేశారు. శ్రీశైలం నుంచి కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమాల ద్వారా వాడుతున్న నీటి లెక్కలపై సంయుక్త కమిటీలు లెక్కలు సమర్పించాలని కోరినా అది కూడా జరగడం లేదని తెలిపారు. దీనికి తోడు జూరాల నుంచి కల్వకుర్తికి తీసుకుంటున్న నీటితో పాటు, జూరాల కుడి, ఎడమ కాల్వల కింద జరుగుతున్న వినియో గంపైనా ఇప్పటివరకు లెక్కలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా నీటి వినియోగ లెక్కలు సంయుక్తంగా బోర్డుకు మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా పంపాలని సూచిం చారు. ఒకవేళ ఇరురాష్ట్రాలు సంయుక్తంగా పంపించలేని పరిస్థితుల్లో ఏ ఒక్కరైనా వినియోగ లెక్కలు పంపాలని లేఖలో పేర్కొన్నారు.