
సాక్షి, హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ కోర్టు పరిధిలో ఉందని, ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోర్టు ఆదేశాల మేరకే చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 15 రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేయాలని మాత్రమే ఆదేశించామని, ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ పరిశీలన ఆమోదించడానికి కాదని తెలిపింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ఆమోదంపై తప్పుడు కథనాలు వస్తున్నాయని తెలిపింది. 15 రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ఆమోదం అనేది తప్పుడు ప్రచారమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని రకాలుగా పరిశీలించాకే అనుమతి ఇస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన ఎలాంటి ప్లాట్స్‌నైనా ఎల్‌ఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరించామని పేర్కొంది.