ఏడాది కాలంలో వైద్యారోగ్యశాఖలో పలు మార్పులు
సాక్షి, హైదరాబాద్ :
» రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 2014 నుంచి 2023 అక్టోబర్ వరకు నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేస్తే, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ నెలకు సగటున రూ.76 కోట్లు ప్రభుత్వం వెచి్చంచింది.
» రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. 11 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల ధరల పెంపు సమస్యను 6 నెలల్లో పరిష్కరించింది.
» ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరలను సుమారు 20 శాతం వరకూ పెంచింది.
» కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడంతో ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య 1,835కి పెరిగింది.
» కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే ఆరోగ్యశాఖలో 7,750 పోస్టులను భర్తీ చేసింది.
» మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా మరో 6,494 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
» మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1,690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులు, 308 ఫార్మసిస్ట్ (ఆయుష్) పోస్టుల భర్తీకి త్వరలోనే ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్లు ఇవ్వనున్నది.
» ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, హాస్టళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
» ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున, మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి రాగా, మొత్తం సంఖ్య 4,090కి పెరిగింది.
» కొడంగల్‌లో 50 ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ, 50 సీట్ల కెపాసిటీతో ఫిజియోథెరపీ కాలేజీ, 30 సీట్ల కెపాసిటీతో పారామెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు జారీ.
» కొడంగల్‌లో 50 పడకల హాస్పిటల్‌ను 220 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసింది.
» మంచిర్యాలలో 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.
» ఉస్మానియా, గాం«దీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం రూ. 204.85 కోట్లతో కొత్త హాస్టల్ బిల్డింగ్‌లు మంజూరు.
» 16 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలు అందుబాటులోకి..
» ఒక్కో పారామెడికల్ కాలేజీలో 60 సీట్ల చొప్పున, 28 కాలేజీల్లో ఏడాదికి 1,680 మంది విద్యార్థులు పారామెడికల్ కోర్సులను అభ్యసించబోతున్నారు.
» రూ.2 వేల కోట్లతో గోషామహల్‌లోని 32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి పూర్తయిన భూబదలాయింపు ప్రక్రియ
» రాష్ట్రంలో కొత్తగా 16 డయాలసిస్ సెంటర్ల మంజూరు. ఇప్పటికే ఉన్న 20 డయాలసిస్ సెంటర్లలో అదనంగా 89 డయాలసిస్ మిషన్లు పేషెంట్లకు అందుబాటులోకి..
» డయాలసిస్ పేషెంట్ల సర్జరీలకు సుమారు రూ.33 కోట్లతో వాసు్క్యలర్ సెంటర్ల మంజూరు.
» రూ.లక్షల ఖరీదైన ఐవీఎఫ్ సేవలను ఉచితంగా గాంధీ ఆస్పత్రిలో అందుబాటులోకి. త్వరలో పేట్లబుర్జు దవాఖాన, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎంలోనూ ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
» రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎమర్జన్సీ సమయాల్లో బాధితుల కోసం ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు
» ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు, ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీల ప్రతిపాదన.
» 136 నూతన 108 అంబులెన్స్‌లలో గిరిజన ప్రాంతాలకు 45 కేటాయించాలని నిర్ణయం. మిగతా వాటిని మండలాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాంతాలకు కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment