
కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వరి కోసిన పంటపొలాల్లోని కొయ్య కాళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో ఈదులకుంట నుంచి కొత్తకుంట వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ మంటలు వ్యాపించాయి.
ఇలా సుమారు వంద ఎకరాలకు మంటలు విస్తరించగా.. పశుగ్రాసంతో పాటు 20 మంది రైతులకు చెందిన పైపులు, విద్యుత్ వైర్లు, మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. మరోవైపు అగ్నిమాపక వాహనాలు కూడా రాకపోవడంతో రాత్రివరకు మంటలు భారీగా ఎగిసి పడుతూనే ఉన్నాయి. గ్రామాన్ని దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
చదవండి:
రైతుల పొట్టగొట్టి.. జనాల జేబుకొట్టి.. దోచుకుంటున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment