సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. అన్ని జిల్లాల్లో ప్రమాదఘంటికలు మోగి స్తోంది. సామాజిక వ్యాప్తి జరగడంతో ఎక్కడెలా కేసులు పెరుగుతున్నాయో అంతుచిక్కడంలేదు. వైద్య ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఇప్పటివరకు తెలంగాణలో 4,16,202 కరో నా పరీక్షలు నిర్వహించారు. మొత్తం కేసులు 60,717కి చేరాయి. 44,572 మంది కోలుకున్నారు. 505 మంది చనిపోయారు. 15,640 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 10,155 మంది హోం లేదా ఇతరత్రా ఐసోలేషన్‌లో ఉన్నారు. మిగిలినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బులెటిన్‌లో వివరించారు.
కొత్తగా 1,811 కేసులు
బుధవారం(29న) కొత్తగా 1,811 కరోనా కేసులు నమోదయ్యాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. ఒక్కరోజే 13 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 821 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ ఒక్కరోజే రాష్ట్రంలో 18,263 కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా నమోదైన వాటిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 521, రంగారెడ్డిలో 289, మేడ్చల్ 151, వరంగల్ అర్బన్ 102, కరీంనగర్ 97, నల్లగొండ 61, నిజామాబాద్ 44, మహబూబ్‌నగర్‌లో 41 కేసులున్నాయి. అతితక్కువగా కొమురంభీం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.
భారీగా పడకలు ఖాళీ
57 ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నారు. వాటన్నింటిలో కలిపి 8,446 పడకలు ఉం డగా, ఇప్పటివరకు 2,188 బెడ్స్ నిండిపోయాయి. ఇంకా 6,258 పడకలు ఖాళీగా ఉన్నాయని బులెటిన్‌లో తెలిపారు. ఇక 95 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 5,494 పడకలు కేటాయించగా, అందులో 3,297 బెడ్స్ రోగులతో నిండాయి. ఇంకా 2,197 పడకలు ఖాళీగా ఉన్నాయని ఆస్పత్రుల వారీగా వివరాలను బులెటిన్‌లో వెల్లడించారు. మొత్తం కలిపి ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 8,455 పడకలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కాగా, ఈ నెల 28న విడుదల చేసిన బులెటిన్‌లో 55 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లోని పడకల వివరాలు ఇవ్వగా, 29న 80 ఆసుపత్రుల వివరాలు ఇచ్చారు. కరోనా చికిత్సల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు పెంచుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment