
సాక్షి, హైదరబాద్: షాపింగ్‌ను, హైదరాబాద్ నగరాన్ని వేర్వేరుగా చూడటం దాదాపుగా సాధ్యం కాదేమో..! సిటీ లైఫ్‌స్టైల్‌లో షాపింగ్‌కు అంతటి ఆదరణ, క్రేజ్ ఉంది. ఇప్పటికే నగరంలో ఎన్నో మాల్స్, షాపింగ్ జోన్స్ ఉన్నప్పటికీ రద్దీ మాత్రం తగ్గట్లేదు. ఈ తరుణంలో ఇండియా కా హైపర్‌మార్ట్‌గా పిలుచుకునే ప్రతిష్టాత్మక ‘నేషనల్ మార్ట్’ను నగరంలో తాజాగా ప్రారంభించారు. షాపింగ్ ప్రియుల అవస్థలను తీర్చడానికి సుచిత్ర–మేడ్చల్ మధ్య 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నేషనల్ మార్ట్ ఏర్పాటైంది.
ఈ మార్ట్ వేదికగా కిరాణా సరుకులు, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, స్టేషనరీ, గృహ–వంటగది ఉపకరణాలు, పాదరక్షలు, దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా సిటీ లైఫ్‌స్టైల్‌కు ప్రతీకగా వినూత్న ఫ్యాషన్ శ్రేణులతో స్టైల్ మార్ట్‌ని సైతం పరిచయం చేస్తున్నామని నేషనల్ మార్ట్ వ్యవస్థాపకుడు యష్ అగర్వాల్ తెలిపారు. అవాంతరాలు లేని షాపింగ్ కోసం 24 బిల్లింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వినియోగదారులందరికీ షాపింగ్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్యాకెట్ ఫ్రెండ్లీ ధరలతో సేవలందిస్తున్నామని యష్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment