కొత్తగా 13 జిల్లా పట్టణాభివృద్ధి సంస్థలు | newly 13 urban development authoritys: Telangana | Sakshi
Sakshi News home page

కొత్తగా 13 జిల్లా పట్టణాభివృద్ధి సంస్థలు

Published Sat, Oct 26 2024 5:24 AM | Last Updated on Sat, Oct 26 2024 5:24 AM

newly 13 urban development authoritys: Telangana

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే ఉన్న యూడీఏల పరిధి పెంపు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 13 పట్టణాభివృద్ధి సంస్థలు (అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (యూడీఏ)లకు తోడు వనపర్తి, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, కామారెడ్డి, కాగజ్‌నగర్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్‌ జిల్లాల పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ ఉత్తర్వుల ప్రకారం రోడ్‌ నెట్‌వర్క్, తాగునీరు, ఉపాధి అవకాశాలు, శాటిలైట్‌ టౌన్‌íÙప్‌ల అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలను ఈ యూడీఏల పరిధిలోకి తీసుకువచ్చారు. వీటితోపాటు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, స్తంభాద్రి (ఖమ్మం), మహబూబ్‌నగర్, వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధిని పెంచారు. ఈ మేరకు ఆయా యూడీఏల పరిధిలోనికి వచ్చే మున్సిపాలిటీలు, గ్రామాలను ఈ ఉత్తర్వుల్లో నోటిఫై చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement