
మహబూబ్‌నగర్ క్రైం: భార్యను హత్య చేసిన కేసులో భర్తను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. వివరాలు.. మండలంలోని పేరపల్ల సమీపంలోని డ్రైవర్ గోపితండాకు చెందిన శారు రాథోడ్ (20)ను సమీపంలోని రెడ్యానాయక్ తండాకు చెందిన మేనత్త కొడుకు వినోద్‌నాయక్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాయి నిర్ణయించాయి.
మేనరికం పెళ్లి ఇష్టం లేకపోయినా వినోద్‌నాయక్ పెద్దల మాటకు అడ్డు చెప్పకుండా జనవరి 21న వివాహం చేసుకున్నాడు. గడిచిన ఈ రెండు నెలల నుంచి భార్యకు దూరంగానే ఉంటూ తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం మరోసారి భార్యతో గొడవ పెట్టుకొని ఆమెను కొట్టాడు. కుటుంబ సభ్యులు కలుగజేసుకొని వినోద్‌ను బయటికి పంపించారు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరోసారి గొడవ పెట్టుకొని ఆమె గొంతును నులిమి చంపాడు.
అనంతరం నేరం తన మీదుకు రాకుండా ఉండేందుకు అందరిని నమ్మించడానికి పురుగుమందు తాగించి, చీరతో ఉరి వేసే ప్రయత్నం చేశాడు. అది విఫలం కావడంతో ఇంట్లో నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి, టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లతో కలిసి విచారణ జరిపారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకొని రిమాండ్ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment