సాక్షి, హైదరాబాద్: గ్యాస్ పంపిణీదారులకు వెంటనే వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేషన్ కోరింది. వ్యాక్సినేషన్ చేపట్టకుంటే ఈ నెల 29 నుంచి గ్యాస్ డెలివరీ నిలిపేస్తామని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వెంకటేశ్వరరావు, కె.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఇప్పటికే అనేక మంది పంపిణీదారులు వైరస్ బారిన పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ఇంటింటికీ వెళ్లి ఎల్పీజీ సిలిండర్లు అందజేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో రోజుకు రెండు లక్షల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment