
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రేపు, ఎల్లుండి జరగబోయే ఇంజనీరింగ్, బీసీఏ, బి ఫార్మసీ, బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేశారు. అనివార్య పరిస్థితుల వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపారు. తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. అయితే సెప్టెంబరు 17(గురువారం) నుంచి జరిగే పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, ఇందులో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. (చదవండి: డిగ్రీ, పీజీ పరీక్షలపై ప్రభుత్వానికే స్పష్టత లేదు)