
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం 80 వ స్నాతకోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు వర్సిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో స్నాతకోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్ ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న 80వ స్నాతకోత్సవంలో 270 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకోనున్నారు. అలాగే పీహెచ్‌డీ పూర్తిచేసిన సుమారు 680 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టాలను స్వీకరిస్తారు. ఓయూ స్నాతకోత్సవాన్ని ప్రముఖ టీవీ చానళ్లతో పాటు యూట్యూబ్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment