
వరంగల్: భద్రకాళి దేవాలయం వద్ద పలని సేవాదళ్ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానానికి మించిన దానం మరేదీ లేదని, గత మూడు సంవత్సరాలుగా పలని సేవాదళ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని ప్రజలు అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల నిర్వాహకులను ప్రజలు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, పలణి సేవాదళ్ నిర్వాహకులు గుండా అమర్నాథ్, పబ్బతి సత్యనారాయణ, మోదె నాగెందర్ ,నూతన్ కుమార్, దేవా అరవింద్,గరినే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment