New Year Celebration: Petition Against TS Government In High Court Over Permissions - Sakshi
Sakshi News home page

హైకోర్టు ఏం చెప్పింది? కేసీఆర్‌ సర్కార్‌ ఏం చేస్తోంది?.. న్యూఇయర్‌ వేడుకల అనుమతులపై పిటిషన్‌

Published Wed, Dec 29 2021 2:21 PM | Last Updated on Wed, Dec 29 2021 2:34 PM

Petition Against T Government In HC Over New Year Celebrations Permission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకం పేరిట ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మరీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చిందంటూ పిటిషన్‌లో పేర్కొని ఉంది. 


ఇతర రాష్ట్రల మాదిరి ఆంక్షలు పెట్టాలని  హైకోర్ట్ ఆదేశించినా..  ప్రభుత్వం పట్టించుకోలేదని, పైగా ప్యాండమిక్, ఎపిడెమిక్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్ విన్నవించారు.  పెరిగిపోతున్న ఒమిక్రాన్‌ కేసుల్ని కట్టడి చేయకుండా.. ఇష్టానుసారంగా టీ సర్కార్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న పిటిషనర్‌.. తెలంగాణలో 62  ఒమిక్రాన్ కేసులు నమోదయిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ఎదుట ప్రస్తావించారు. 

ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఉత్తర్వులను వెనక్కి తీసుకుని.. న్యూ  ఇయర్ వేడుకలపై   ఆంక్షలు విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఇక పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. రేపు(గురువారం) విచారిస్తామని పిటిషనర్‌కి తెలిపింది.


సంబంధిత వార్త: తెలంగాణలో న్యూఇయర్‌ వేడుకలకు స్పెషల్‌ పర్మిషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement