ఈసారి పాలేరులో పావురం | Pigeons With Badge On Legs Found In Khammam District | Sakshi
Sakshi News home page

ఈసారి పాలేరులో పావురం

Published Fri, Jan 7 2022 3:43 AM | Last Updated on Fri, Jan 7 2022 9:36 AM

Pigeons With Badge On Legs Found In Khammam District - Sakshi

ఖమ్మం జిల్లా పాలేరులో చిక్కిన పావురం. పావురం కాలికి ఉన్న ట్యాగ్‌  

కూసుమంచి: ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు.. కాళ్లకు విదేశీ భాషలతో కూడిన ట్యాగ్‌లతో వస్తున్న పావురాల విషయంలో మిస్టరీ వీడిపోయింది. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలానికి బుధవారం పావురం రాగా.. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన నునావత్‌ నవీన్‌ ఇంటి ఆవరణలో గురువారం ఓ పావురం వాలింది. దీని రెండు కాళ్లకు ట్యాగ్‌లుండగా.. అప్పటికే పత్రికల్లో వచ్చిన కథనాలను చూసిన ఆయన అనుమానపడ్డారు.

పావురం కాలికి ఉన్న ట్యాగ్‌పై దాస్‌ అనే పేరుతో ఫోన్‌ నంబర్‌ ఉండగా.. ఆ నంబర్‌కు ఫోన్‌చేసి ఆరా తీశారు. కర్నూలుకు చెందిన వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ ఆ పావురం తనదేనని, ఇటీవల 50 వరకు పావురాల కాళ్లకు ట్యాగ్‌లు కట్టి పోటీల్లో భాగంగా వదిలి పెట్టామని వివరించాడు. అవి కరీంనగర్, హైదరాబాద్‌ చేరుకోవలసి ఉండగా.. కాళ్లకు కట్టిన ట్యాగ్‌పై ఉన్న స్క్రాచ్‌ కార్డు ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ పావురాలతో ప్రమాదం లేదని చెప్పారు. వీలైతే సంరక్షించాలని లేదా రంధ్రాలు కలిగిన బాక్సుల్లో ఉంచి తమ చిరునామాకు బస్సుల ద్వారా పంపించాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement