
హైదరాబాద్.: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాస పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నాతాధికారలు హాజరయ్యారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం రూ. 6వేల కోట్ల రాయితీ రుణాలు ఇవ్వనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ. 4 లక్షల వరకూ రాయితీ రుణం కేటాయించే అవకాశం ఉంది. దరఖాస్తులను ఏప్రిల్ 5వ తేదీ వరకూ ఆహ్వానించనున్నారు. ఆపై అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2 వతేదీన రాయితీ రుణాలను మంజూరు చేయనుంది ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment