![Rakesh Tikait Talk On Golconda Farm Land In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/25/Rakesh-Tikait-Talk.jpg.webp?itok=KzzozEeH)
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలు, మద్దతు ధర తదితర అంశాలపై ఆందోళ చేస్తామని కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ అన్నారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తమ నాలుగు డిమాండ్లలో రెండు డిమాండ్లులపై మాత్రమే కేంద్రం స్పందించిందని తెలిపారు. ఎంఎస్‌పీ ధర విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు. ఎంఎస్‌పీపై చట్టం తేవాలని కేంద్రాన్ని కొరామని తెలిపారు.
చదవండి: సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’
తెలంగాణలో రైతుల సమస్యలు చాలా ఉన్నాయని రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండలో రైతుల భూమి ఉందని తెలిసిందని, అది గోల్ఫ్ కోర్టుకు ఇచ్చారని తేలిందని అన్నారు. రైతుల సమస్యలపై పూర్తి సమాచారం తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment