సాక్షి, హైదరాబాద్: రాత్రుళ్లు ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఆవుల కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. గత 7సంవత్సరాల నుంచి 90 కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల ఖమ్మం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. జూలైలో విడుదల అయిన నిందితుడు మళ్ళీ దొంగతనాలకు పాల్పడటం మొదలు పెట్టాడు. రెక్కీ నిర్వహించి చోరి చేయడం అతని నైజం అని తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనం, నల్ల హెల్మెట్ వాడుతూ చోరీలు చేస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.16.70 లక్షల విలువ చేసే 390గ్రాముల బంగారం, 829 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నారు. మరో 60తులాల బంగారం రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: 14 కేజీల బంగారం మాయం..
Comments
Please login to add a commentAdd a comment