కమతం రాంరెడ్డి మనవడు శైలేందర్‌రెడ్డి
వికారాబాద్: మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుటుంబం నుంచి ఆయన మనవడు శైలేందర్‌రెడ్డి (కూతురి కొడుకు) పరిగి నియోజకవర్గం బరిలో ఉంంటారని సమాచారం. ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రి సేవలందించిన కమతం అడుగుజాడల్లో శైలేందర్‌రెడ్డి ముందుకెళ్తున్నారు.
నియోజకవర్గంలో తన తాత చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. నిత్యం జనం మధ్యలో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శైలేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. పండుగలు, ఉత్సవాల నేపథ్యంలో నియోజకవర్గం మొత్తం ప్లెక్సీలతో నింపి తన పరిచయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు.
రెండు సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. రెండు ప్రధాన పార్టీల నుంచి తాను టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. ఏ పార్టీ నుంచైనా అవకాశం వస్తే బరిలో ఉంటానని, టికెట్ రాకపోయినా ప్రజాసేవ చేస్తానని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment