సాక్షి, మంచిర్యాల: కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బొగ్గుబాయిల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించకపోవడంపై కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ సెక్టార్‌లో లేనివిధంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు సింగరేణి భూగర్భ గనుల్లో అధికంగా ఉండడం, భౌతిక దూరం ఏమాత్రం సాధ్యం కాని గనుల్లో పని చేస్తున్న తమను కరో నా నుంచి ఎందుకు కాపాడే చర్యలను యాజమాన్యం, ప్రభుత్వం తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నా రు. మొదటి వేవ్‌లో లాక్‌డౌన్‌లో భాగంగా సింగరేణిలో 2020 మార్చి 22 నుంచి 41 రోజులపాటు లే ఆ ఫ్ ప్రకటించి యాజమాన్యం గనులను మూసివేసింది. ఇప్పుడు సెకండ్ వేవ్ భయానకమైన పరిస్థితి నె లకొంది.
రాష్ట్ర ప్రభుత్వం బు«ధవారం నుంచి లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సింగరేణిపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌డౌన్, లేఆఫ్ మరేదైన చ ర్యలు తీసుకోవాలని కార్మిక వర్గం డిమాండ్ చే స్తోంది. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉంది. కంపెనీ వ్యాప్తంగా ఎక్కువ ఉద్యోగులు పనిచేసే రీజి యన్ బెల్లంపల్లి రీజియన్ కావడం గమనార్హం. ఈ రీజియన్ పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్‌లో కలిసి సుమారు 16 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 14 భూగర్భ గనులు, 6 ఓసీపీలు నడుస్తున్నాయి. రోజువారీగా 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. ఎక్కువ భూగర్భ గనులు ఎక్కువగా ఉండడంతో కార్మికుల ప్రమాదాల అంచునా పని చేయాల్సి వస్తోంది.
చదవండి: పోలీసన్న నీకు సెల్యూట్.. మానవత్వం చాటుకున్న ఎస్సై!
భౌతిక దూరం సాధ్యమయ్యే పనేనా...
కార్మికులు భౌతిక దూరం పాటించి విధులు నిర్వహించాలని, మాస్క్‌లు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సాధ్యం అవుతుందా అనేది అధికారులే చెప్పాలి. భూగర్భ గనుల్లో కోవిడ్ నియమావళి ప్రకారం ఈ పద్ధతులన్ని పాటిస్తే తట్ట బొగ్గు కూడా రాదనేది నగ్న సత్యం. భుజం.. భుజం కలిపితేనే అక్కడ పని జరుగుతుంది. మొన్నటి వరకు కరోనా ఉధృతి పెద్దగా లేకపోవడం, మరణాలు కూడా తక్కువ స్థాయిలోనే ఉండడంతో కార్మికులు «ధైర్యంగా పని చేశారు. నేటి పరిస్థితి చూస్తే ఏమాత్రం పనిచేయలేని దుస్థితి ఉంది. గనుల్లో పని చేసేటప్పుడు భౌతిక దూరం సాధ్యం కాదు. డ్రిలింగ్ చేయాలంటే ఆ మిషన్‌ను ముగ్గురు పట్టుకోవాలి. రూఫ్‌బోల్టింగ్ చేయాలంటే ముగ్గురు గట్టిగా మిషన్ పట్టుకొని పనిచేయాలి.
ట్రామింగ్ పనులు, మేషన్ పనులు, యంత్రాల వద్ద నిర్వహణ, ఇంకా ఇతర భూగర్భంలో ఏ పనిచేసిన కూడా భౌతిక దూరం సాధ్యం కాదు. మరో పక్క గనుల్లో వెంటిలేషన్æ(గాలి సరఫరా) అంత ఒక్క చోట ఫ్యాన్ నుంచి పంపించి మరో చోటు నుంచి తోడేస్తారు. ఇలా ఒక చోట నుంచి మరో చోటుకు గాలి మరలుతూ ఉంటుంది. అప్పుడు ఒక్క డిస్ట్రిక్ట్‌లో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరు తుమ్మినా, దగ్గినా అతని ద్వారా వచ్చే వైరస్ మొత్తం వ్యాప్తి చెందుతుంది. గని అంటేనే పూర్తి క్లోజ్డ్ ఏరియా అని అందరికి తెలిసిందే. ఇక మాస్క్ ధరించి పని చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. మసి చేతులతో సానిటైజర్ ఎలా రాస్తారో... ఎన్ని సార్లు చేతులు శుభ్రం చేసుకొంటూ కరోనా నుంచి తమను తాము కార్మికులు కాపాడుకోవాలో అధికారులు చెప్పాలి.
విద్యుత్ కోసం ఓసీపీలు నడిపించుకోవచ్చు..
భూగర్భ గనులు మూసివేసి ఓసీపీలు నడిపించడం వల్ల ఇబ్బంది ఉండదు. ఓసీపీ పూర్తిగా ఓపెన్ ఏరి యాలో ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. భూ గర్భ గనుల్లో పోల్చితే చాలా తక్కువగా రిస్క్ ఉంటుందని మైనింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. పవ ర్ ప్లాంట్లకు సరిపడా బొగ్గును ఓసీపీలు అందించే అవకాశం ఉన్నందున యాజమాన్యం ఓసీపీ నడిపిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని కార్మికులు పేర్కొంటున్నారు.
పెరుగుతున్న కేసులు.. మరణాలు..
సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఇటీవల చాలా మంది మరణించారు. దీనిపై స్పష్టమైన గణాంకాలు ఎవరి వద్దా లేవు. కంపెనీ దవాఖానాలో నమోదు అవుతాయి, బయటికి ఆసుపత్రుల్లో వెళ్లిన వారివి పూర్తి స్థాయిలో నమెదు కావడం లేదు. శ్రీరాంపూర్ వంటి పెద్ద ఏరియాలో రోజుకు సుమారు 100 మందికి కోవిడ్ పరీక్షలు చేస్తే అందులో సుమారు 30 మంది ఉద్యోగులే ఉంటున్నారు. కార్మికుల ద్వారా వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకుతుంది. వారు చాలామంది పాజిటివ్ బారిన పడుతున్నారు. శ్రీరాంపూర్ డివిజన్‌లో ఈ వారంలోనే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి ఏడుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులను కాపాడుకోవడం కోసం యాజమాన్యం, ప్రభుత్వం సమాలోచనాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment