
నాళేశ్వర్‌లో పాముతో సర్వర్ ఖాన్
సాక్షి, నవీపేట(నిజామాబాద్): మండలంలోని నాళేశ్వర్ గ్రామ శివారులో గత రెండు రోజులుగా రైతులను భయపెడుతున్న ఐదు అడుగుల నాగుపాము ఆదివారం దొరికింది. గ్రామానికి చెందిన పోశెట్టి అనే రైతు పొలంలో రెండు రోజుల కిందట కనిపించిన నాగుపాము పలువురిని భయాందోళనకు గురి చేసింది.
రైతులు అటువైపుగా వెళ్లేందుకు భయపడ్డారు. ఆదివారం మళ్లీ ఆ పాము కనిపించడంతో నందిపేటకు చెందిన సర్వార్‌ఖాన్ పాములు పట్టడంలో దిట్ట అతనికి సమాచారమిచ్చారు. ఆయన తన చాతుర్యంతో పామును పట్టేశాడు. పట్టుకున్న పామును అటవీశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment