సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో హరీశ్‌రావుతో అమెరికా డాక్టర్ల బృందం భేటీ అయింది. ఈ భేటీలో వైద్య రంగంపై చర్చించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మెడికల్ సీట్ల కోసం ఇతర దేశాలకు వెళ్లకుండా సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలపై దృష్టి పెట్టారని తెలిపారు.
అందులో భాగంగా 8 మెడికల్ కాలేజీలు నిర్మించి వైద్య విద్య బోధనకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందిస్తున్నామని హరీశ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గర్భిణీలు, నవజాత శిశు సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకం, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment