సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల కన్నా డిశ్చార్జ్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,653కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,426కు చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,070 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,367 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు 2,49,157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 94.86 శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.54శాతానికి తగ్గింది. (యూఓహెచ్ ఘనత.. మరింత చౌకగా ఫావిపిరవిర్)
Comments
Please login to add a commentAdd a comment