సాక్షి, హైదరాబాద్: కరోనాతో మరణించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కుటుంబాలకు కేంద్రం అందించే రూ.50 లక్షలతో పాటు మరో రూ.25 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో వివిధ డాక్టర్ల సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల డాక్టర్ల సంఘాలు చేసిన పలు విజ్ఞప్తులపై సీఎం కేసీఆర్‌తో చర్చించిన వివరాలను మంత్రి సంఘాల నాయకులకు వివరించారు. కరోనా సోకిన డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి నిమ్స్‌లో పూర్తి స్థాయి చికిత్స అందించాలని నిర్ణయించామన్నారు. అయితే సంఘాలు మాత్రం డాక్టర్లకు సీఎం సహాయనిధి నుంచి మరికొంత సాయం అందించాలని కోరాయని తెలిపారు. అలాగే, కోవిడ్ వల్ల అనారోగ్యం బారిన పడిన వారిని ఆన్ డ్యూటీగా పరిగణించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. (చదవండి: కరోనాకు చంపే శక్తి లేదు)
(చదవండి: ఆక్సిజన్ కొరతకు చెక్!)
Comments
Please login to add a commentAdd a comment