తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌ | Telangana Assembly Elections 2023: November 1st Updates - Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

Published Wed, Nov 1 2023 1:04 PM | Last Updated on Wed, Nov 1 2023 6:49 PM

Telangana Assembly Elections: November 1st Updates - Sakshi

Updates:

06:48 PM, నవంబర్‌ 1, 2023
తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు
►తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు
►తెలంగాణలో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదు
►బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి
►ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ
►చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతూ టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని
►తెలంగాణలో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చేందుకు పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ

04:50 PM, నవంబర్‌ 1, 2023
మాజీ ఎంపీ వివేక్ దారిలో మరో బీజేపీ నేత?
►శేరిలింగంపల్లి సీటు విషయంలో జనసేన, బీజేపీ మధ్య పంచాయితీ
►శేరిలింగంపల్లి సీటును రవి యాదవ్‌కు ఇవ్వాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టు
►శేరిలింగంపల్లి జనసేనకు కేటాయిస్తే బీజేపీకి రాజీనామా చేస్తానంటోన్న కొండా

03:30 PM, నవంబర్‌ 1, 2023

న్యూఢిల్లీ: బీజేపీలోకి ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
►సాయంత్రం బిజెపిలో చేరనున్న సుభాష్ రెడ్డి

►గద్వాల నుంచి  పోటీకి డీకే అరుణ దూరం
►అధిష్టానానికి  తన నిర్ణయం తెలిపిన డీకే అరుణ
►ఇప్పటికే పోటీ నుంచి తప్పుకున్న డాక్టర్ లక్ష్మణ్ , కిషన్ రెడ్డి 
►రాష్ట్రవ్యాప్తంగా తాము ప్రచారం చేస్తామంటున్న బడా నేతలు 
►లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న అరుణ

►బీజేపీలో చేరిన బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
►కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిక

02:50pm, నవంబర్‌ 1, 2023

డీ రాజా సీపీఐ జాతీయ కార్యదర్శి
►తెలంగాణ లో కాంగ్రెస్ తో పొత్తుల చర్చలు కొనసాగుతున్నాయి.
►మేం అడిగిన సీట్లు ఇస్తారన్న మాకు నమ్మకం ఉంది.
►జాతీయ స్థాయిలో బీజేపీ ని ఓడించడమే లక్ష్యం.
►ఇండియా కూటమిలో మా పాత్ర కీలకం గా ఉంటుంది.
►బీజేపీ ని ఓడించేందుకు కలిసి వచ్చిన వారితో పొత్తులు పెట్టుకుంటాం

నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

►కొత్తగూడెం, బెల్లంపల్లి టికెట్లు కోరాం.
►బెల్లంపల్లి కాకుండా చెన్నూరు తీసుకోమన్నరు.
►సిపిఎం సీట్లపై చర్చ జరుగుతుంది.
►ఇంకా సిపిఎం సీట్లపై స్పష్టత రాలేదు.
►రేపో మాపో మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటిస్తుంది.
►ఇండియా కూటమి బలపడటం వల్ల భాజపాను నిలవరించవచ్చు.
►ఊహాగానాలను తాము నమ్మము.
►వివేక్ కాంగ్రెస్ లో చేరడం మంచి పరిణామం.
►చెన్నూరులో సీపీఐ గెలుపుకు వివేక్ కృషి చేస్తారు.
►పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి విజయం కోసం కృషి చేస్తాం.
►అనుమానాలు, ఊహాగానాలతో పొత్తును చెడగొట్టుకోలేము.

02:00pm, నవంబర్‌ 1, 2023

ప్రకాష్ జవదేకర్, బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇంఛార్జి

► కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతితో లక్ష కోట్ల రూపాయలు నీళ్ళలో కొట్టుకుపోయాయి.
►మేడిగడ్డ తరహాలోనే, అన్నారం బ్యారేజ్ కు ప్రమాదం పొంచి ఉంది.
►ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సమాధానం చెప్పాలి.
►వచ్చే ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్ కి గుణపాఠం చెప్తారు.
►కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం.

01:00pm, నవంబర్‌ 1, 2023

జనతా కా మూడ్‌ సర్వేలో BRSకు ఎడ్జ్‌
► తెలంగాణ 2023 - జనతా కా మూడ్ సర్వే
►బీఆర్‌ఎస్‌దే  మళ్లీ అధికారం
►72-75 సీట్లు గెలుచుకోనున్న బీఆర్‌ఎస్‌ పార్టీ
►31-36 సీట్లకు పరిమితం కానున్న కాంగ్రెస్ పార్టీ
►బండి సంజయ్ తొలగింపు, కర్ణాటకలో ఓటమి బీజేపీపై ప్రభావం చూపిందన్న  జనతా కా మూడ్

పార్టీ  ఓటు షేర్    సీట్లు
బిఆర్ఎస్ 41% 72-75
కాంగ్రెస్ 34%. 31-36
బిజెపి 14%. 4-6
ఎం ఐ ఎం 3% 6-7
ఇతరులు 8% 0

►గత నెల కిందట సర్వే చేశాం.
►లక్ష 20 వేల శాంపిల్స్ సేకరించాము. ప్రతి నియోజకవర్గంలో 1100 మంది శాంపిల్స్ తీసుకున్నాం
►విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
►గత 30 ఏళ్ల లో చూడని  మంచి ఫలితాలు కాంగ్రెస్ సాధిస్తుంది.
► 👆భాస్కర్ సింగ్, జనతా కా మూడ్

12:40pm, నవంబర్‌ 1, 2023
ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి‌ తీసుకెళ్తున్న వీరేశం
► నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం బాబాసాహెబ్ గూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల ప్రచారం నిర్వహించారు

12:34pm, నవంబర్‌ 1, 2023
సవాల్‌కు సవాల్‌
►నిర్మల్   జిల్లా ముథోల్  నియోజకవర్గంలో  బిజెపి   అబద్దాలను   ప్రచారం చేస్తుందన్నారు బిఅర్ఎస్   అభ్యర్థి   ఎమ్మెల్యే విఠల్  రెడ్డి.
► మోసపూరిత  ప్రచారాన్ని   ప్రజలు నమ్మరన్నారు‌.‌  తనపై అవినీతి  అరోపణలు  చేసిన బిజెపి అభ్యర్థి రామరావు పటేల్తో బహిరంగ చర్చకు సిద్దమన్నారు  ఎమ్మెల్యే‌‌

12:25pm, నవంబర్‌ 1, 2023
ఎన్నికల వేళ పూజలు
బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ప్రత్యేక పూజలు   
► హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం గోపాల్ పూర్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్సీ,  బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

12:05pm, నవంబర్‌ 1, 2023
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు
► యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం సభ నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య.
► ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

11:45pm, నవంబర్‌ 1, 2023
భర్తలకు మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో భార్యలు
సూర్యాపేట: ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి సతీమణి సునీత
► కరీంనగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన కుటుంబ సభ్యులు
► మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సంజయ్ సతీమణి అపర్ణ, ఇతర కుటుంబీకులు.

11:05pm, నవంబర్‌ 1, 2023
కిం కర్తవ్యం.!
అనుచరులతో వైఎస్ షర్మిల భేటీ
► ఎన్నికల్లో పోటీ చేసే అంశం పై అభిప్రాయాలు తీసుకోనున్న షర్మిల
► నామినేషన్లకు ఇంకా రెండ్రోజుల గడువు ఉండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న షర్మిల
► ఇప్పటికే పలుమార్లు పోటీ అంశం పై అంతర్గత సమావేశాలు నిర్మహించిన షర్మిల

10:45pm, నవంబర్‌ 1, 2023
కెటిఆర్‌ స్పీడ్‌మోటార్‌
► కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన 
► భిక్కనూర్, దోమకొండ మండల కేంద్రాల్లో నిర్వహించనున్న సభల్లో పాల్గొననున్న  మంత్రి కేటీఆర్.
► కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్న మంత్రి కేటీఆర్

10:30pm, నవంబర్‌ 1, 2023
తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారు?
► పొత్తులో భాగంగా జనసేనకు 10 సీట్లు ఇచ్చే అవకాశం
► శేరిలింగంపల్లి, అంబర్ పేట, కూకట్‌పల్లి, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వరావుపేట, కోదాడ, నాగర్ కర్నూల్, తాండూరు సీట్లు ఇచ్చే అవకాశం
► మరికొన్ని సీట్లు అడుగుతోన్న జనసేన

10:00pm, నవంబర్‌ 1, 2023
బీ అలర్ట్‌
 తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన
► ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, నోడల్ అధికారులతో సమీక్షించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం
►  సీఎస్, డీజీపీతో సమీక్షించనున్న ఈసీ బృందం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement