Hyderabad: Passport Special Drive To Be Held Between December 19 And 23 - Sakshi
Sakshi News home page

పాస్‌పోర్ట్ కావాలనుకునేవారికి గుడ్‌న్యూస్..

Published Thu, Dec 22 2022 9:03 AM | Last Updated on Thu, Dec 22 2022 3:05 PM

Telangana Good News For Passport Aspirants - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తత్కాల్, సాధారణ కేటగిరీల్లో పాస్‌పోర్టుల జారీకి సంబంధించి దీర్ఘకాలిక అపాయింట్‌మెంట్‌ లభ్యతను తగ్గించేందుకు రాష్ట్రంలోని ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఈనెల 24న శనివారం కూడా పనిచేయనున్నాయి. అలాగే ఈ వారమంతా ప్రత్యేక తత్కాల్‌ స్పెషల్‌ డ్రైవ్‌గా కొనసాగుతుందని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం తెలిపింది.

హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకీలతో పాటు కరీంనగర్, నిజామాబాద్‌లలోని పాస్‌పోర్టు సేవా కేంద్రాలన్నింటిలో ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగనుంది. తత్కాల్‌ కేటగిరీ కింద అర్హత ఉన్న దరఖాస్తుదారులు మాత్రమే తత్కాల్‌ అపాయింట్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తత్కాల్‌ దరఖాస్తుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి ఈనెల 19 నుంచి 23 వరకు ప్రతిరోజూ 50 అదనపు తత్కాల్‌ అపాయింట్‌మెంట్‌లను ప్రత్యేక ‘వారం తత్కాల్‌ డ్రైవ్‌’ కింద విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

శనివారం ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా రీషెడ్యూల్‌ చేసిన అపాయింట్‌మెంట్‌ స్లాట్‌లు వెబ్‌పోర్టల్‌లో ప్రతిరోజూ వినియోగదారులకు అందుబాటులో ఉంచడంతో పాటు కొత్తగా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
చదవండి: 'ఫోన్ 10 సార్లు ఎందుకు మార్చారు కవిత? వాళ్ల ఇంటికి ఎందుకెళ్లారు?'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement