సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. టీజీఎస్‌ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్‌ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో, దీనికి సంబంధించిన విధివిధానాలను ఆర్టీసీ అధికారులు రూపొందించనున్నారు. మరోవైపు.. ఆర్టీసీ ఖాళీల భర్తీపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా..‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని రూట్స్‌లో బస్సులు సరిగా లేకపోవడంతో ప్రజలు బస్సులు నడపాలని కోరారు. దీంతో, ప్రభుత్వం ఆర్టీసీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment