
సాక్షి, హైదరాబాద్ : కేటీఆర్ ఫామ్ హౌస్ వివాదంపై అక్టోబర్ 19 విచారణ జరిపేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. జన్వాడ ఫామ్ హౌస్ వివాదంపై మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఎన్‌జిటి ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.