సాక్షి, హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరం, పశి్చమ–మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీంతో బుధవారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుంది.
దేవరుప్పులలో 11.5 సెం.మీ.
మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జనగాం జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో అత్యధికంగా 11.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో 10.9 సెం.మీ., దామరచర్ల మండలం తిమ్మాపూర్ లో 9.9, శాలిగౌరారంలో 9.1, రంగారెడ్డి జిల్లా నాగోల్‌లోని రాక్‌టౌన్ కాలనీలో 8.9, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉదిత్యాల్‌లో 8.8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండ లం మండలపల్లిలో 8.7, రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో 8.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment