సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఐటీ, పారిశ్రామిక పెట్టుబడుల సాధన కోసం మంత్రి కేటీఆర్ 10 రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. శనివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరుతున్న కేటీఆర్ బృందం ఈ నెల 29 వరకు అమెరికాలోని తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో పర్యటించనుంద. కేటీఆర్ బృం దంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి ఉన్నారు.
లాస్ ఎంజిలెస్‌తో మొదలయ్యే కేటీఆర్ పర్యటన 20న శాండియాగో, 21న శాన్‌జోస్, 24న బోస్టన్, 25న న్యూయార్క్‌లో కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల అధిపతులు, సీఈవో లతో కేటీఆర్ భేటీ అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడు లకు సంబంధించి ఒప్పందాలు కుదరొచ్చని జయేశ్ రంజన్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment