హైదరాబాద్: నగరంలో ఈ(సోమవారం) ఉదయం పలు ప్రాంతాల్లో వాన కురిసింది. బంజారాహిల్స్, యూసఫ్‌గూడ, లక్డీకాపూల్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, అంబర్‌పేట, ఓయూ.. ఇలా పలుచోట్ల వాన పడింది. పలు చోట్ల చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వాన పడగా.. ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్ రీజియన్‌లో భారీ వర్షం కురిసింది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వాన పడినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వానలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉంది. ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడొచ్చు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.
అయితే ఈదురు గాలలు ప్రభావం మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావొచ్చని చెబుతోంది. ఇదిలా ఉంటే.. మరో వైపు ఎండలు, ఉక్కపోత పరిస్థితులూ తప్పవని వాతావరణ శాఖ చెబుతోంది.
Getting rains now eastern parts of hyderabad south zone of city
— Ts Weatherman (@ts_weather) May 29, 2023
Lb nagar Ou Amberpet saroornagar
Chaitnayapur areas ☔⚡⚡ #HyderabadRains pic.twitter.com/LiWWINTMDh
Comments
Please login to add a commentAdd a comment