
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 35,064 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 287 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.88 లక్షలకు చేరుకుంది. తాజాగా 569 మంది కోలుకోగా, మొత్తం 7.80 లక్షల మంది కోలుకున్నారు.