బస్‌పాస్‌ చార్జీల పెంపు ఉపసంహరించండి  | Telangana: Revanth Reddy React On Bus Pass Fares | Sakshi
Sakshi News home page

బస్‌పాస్‌ చార్జీల పెంపు ఉపసంహరించండి 

Published Sun, Jun 12 2022 1:11 AM | Last Updated on Sun, Jun 12 2022 1:11 AM

Telangana: Revanth Reddy React On Bus Pass Fares - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీగా బస్‌పాస్‌ చార్జీల పెంపు నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలను చదువుకు దూరం చేసేలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉందని పేర్కొన్నారు. ఈ అన్యాయపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆ ట్వీట్‌లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement