సాక్షి, హైదరాబాద్: వేలం ద్వారా గనుల కేటాయింపులు జరిపితే తెలంగాణ రాష్ట్రానికే తగిన ఆదాయం దక్కుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వేలానికి విముఖత చూపి, ఒక్క బ్లాక్ కూడా కేటాయించకుండా ఉండటం వల్ల రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతోందని తెలిపారు. సింగరేణిలో 51% వాటా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉందని స్పష్టంచేశారు.
సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, అది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పారు. అలాగే సింగరేణికి నైని, పెనగడ్డప్ప, న్యూ పాత్రపర అనే 3 బొగ్గు గనులు కేటాయించినట్లు గమనించాలని సూచించారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్ల నుంచి ఈ బ్లాకులను వినియోగించలేకపోయిందని, వేలం మార్గాన్ని నిరాకరించడం వల్ల రాష్ట్రానికి రాయల్టీ, ఆదాయం విషయంలో గండి పడుతోందని జోషి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment