![Warangal Student Got Seat In Elon Musk School Honoured By Mla - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/25/Warangal%20Student.jpg.webp?itok=3W0uJlYV)
సాక్షి,పరకాల(వరంగల్): స్పేస్ కంపెనీ అధినేత టెస్లా్ల సీఈఓ ఎలాన్ మస్క్ అమెరికాలో స్థాపించిన సింథసిస్ పాఠశాలలో ప్రవేశం పొందిన పరకాల పట్టణానికి చెందిన అనిక్‌పాల్ అనే బాలుడిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభినందించారు. హన్మకొండలోని తన నివాసంలో బాలుడు అనిక్‌పాల్‌ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. చిన్న వయస్సులో తల్లిదండ్రులకే కాకుండా పుట్టిన ఊరుకు పేరు తెచ్చినందుకు బాలుడిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, 18వవార్డు కౌన్సిలర్ ఏకు రాజు, ఏకు రఘుపతి, దినేష్ చంద్ర, సుజయ్ రానాతో పాటు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఎలన్ మస్క్ పాఠశాలలో సీటు సాధించిన వరంగల్ విద్యార్థి..!
Comments
Please login to add a commentAdd a comment