
ఎమ్మెల్యే అన్న కొడుకు అరాచకం
తిరుపతి సిటీ: తిరుపతి ఎమ్మెల్యీ ఆరణి శ్రీనివాసులు అన్న కుమారుడు ఆరణి శివ అరాచకాలకు అదుపులేకుండా పోతోందని స్థానికుడు శ్రీమన్నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరణి శివ తిరుపతిలో భూకబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇందులో భాగంగా తిరుపతి నగరంలోని నారాయణపురం కై కాలచెరువు వద్ద ఉన్న సర్వే నం.3–2సీ2ఈ2ఏ 1బీ, 3–2సీ2ఈ2ఏ 1ఏ, ఏ2లోని రెండు ఎకరాల స్థలం తన భార్య డీ.స్వర్ణ పేరుపై ఉందన్నారు. దీన్ని కబ్జా చేసేందుకు పీలేరుకు చెందిన మనోహర్ అనే వ్యక్తితో కలసి ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ రజినీకాంత్, ఆరణి శివ ముగ్గురూ కలుసుకుని కబ్జా చేసేందుకు ప్రత్నిస్తూ, భయానక వాతావరణాన్ని సృష్టి స్తున్నారని వాపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో తాను రూ.124 కోట్లు ఖర్చు పెట్టానని, ఆ డబ్బు తనకు ఎవరిస్తారు.. ఇలాంటి కబ్జాలు చేసుకుంటేనే కదా వచ్చేది అంటూ బాధితులను ఆరణి శివ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులతో నగరంలో కబ్జాలకు, దందాలకు పాల్పడిన హిస్టరీని ఇంటెలిజెన్స్ నివేదికలను పరిశీలిస్తే బయటకు వస్తాయన్నారు. 2003 నుంచి 2024 వరకు 9 జడ్జిమెంట్లు వచ్చి కోర్టులో జరుగుతున్న దానిని తీసుకొచ్చి పోలీసులను పెట్టుకుని బెదిరిస్తున్నాడని తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ రజనీకాంత్ రాత్రి 20 మందిని వేసుకొని దాడి చేయడానికి వచ్చారని తెలిపారు. ఒక గవర్నమెంట్ అధికారి ప్రైవేట్ భూమిలో అర్ధరాత్రి 20 మందితో రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు తమకు న్యాయం చేయాలని కోరారు.
సముద్రంలోకి తాబేళ్ల పిల్లలు
వాకాడు: వాకాడు మండలం, నవాబుపేట సముద్ర తీరంలో సోమవారం జిల్లా ఫారెస్టు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, సిబ్బంది ఆలీవ్‌రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలో విడిచి పెట్టారు. నవాబుపేట వద్ద ఉన్న తాబేళపిల్లల సంరక్షణా కేంద్రం(హేచరీ)లో నుంచి 540 పిల్లలను పలు జాగ్రత్తలతో సముద్రంలో విడిచి పెట్టారు.

ఎమ్మెల్యే అన్న కొడుకు అరాచకం