
రుయాలో టీడీపీ నేతల హల్‌చల్
రుయా ఆస్పత్రి అత్యవసర విభాగం ఎదుట టీడీపీ నేతలు హల్‌చల్ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
వయోపరిమితి పెంచాలి
ఆంధ్రలో డీఎస్సీ నోటిఫికేషన్ 2018లో వచ్చింది. అప్పటి నుంచి చాలామంది డీఎస్సీ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో చాలా మంది అభ్యర్థులకు అవకాశం లేకుండా పోయింది. మాలాంటి అభ్యర్థులకు నిరాశే మిగిలింది. తెలంగాణాలో డీఎస్సీ వయోపరిమితి 46 ఏళ్లకు పెంచారు. ఆంధ్రలో కూడా అదేమాదిరిగా వయోపరిమితి పెంచి రీ నోటిఫికేషన్ ఇవ్వాలి.
–రామచంద్రారెడ్డి, బీఎస్సీ బీఈడీ, తిరుపతి
టెన్షన్ మొదలైంది
డీఎస్సీ పరీక్షలను ఎదుర్కోవాలంటే సుదీర్ఘ ప్రిపరేషన్ అవసరం. అలాంటిది రెండు నెలలు సైతం సమయం లేకుండా సిలబస్ పూర్తి చేయాలంటే ప్రతి అభ్యర్థికీ కష్టతరమే. ప్రిపరేషన్‌కు సమయం తక్కువ కావడంతో టెన్షన్ మొదలైంది. సిలబస్ పూర్తి స్థాయిలో కవర్ చేయగలమా అనే అనుమానం కలుగుతోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి ఉంటే బాగుండేది.
–ఎస్.జప్రీన్, ఎంఏ టీటీసీ,
డీఎస్సీ విద్యార్థిని, తిరుపతి
పోటీ ఎక్కువే
మెగా డీఎస్సీ పేరుతో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్ర వ్యాప్తం 27,333 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ 16 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేసేందుకు నోటిఫికేష్ ఇచ్చారు. పోటీ తీవ్రత ఊహించని రీతిలో ఉంటుంది. కనీసం 30 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఉంటే కొంత ఊరటగా ఉండేది. పోస్టులు తక్కువతో పాటు సమయాభావం పై దృష్టి సారించకుండా పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.
–వేణు, బీఏ బీఈడీ,
డీఎస్సీ అభ్యర్థి, తిరుపతి
– 8లో
– 8లో

రుయాలో టీడీపీ నేతల హల్‌చల్

రుయాలో టీడీపీ నేతల హల్‌చల్