
ఆర్టీసీ ఆదాయం ‘ఖాళీ’
తిరుపతి అర్బన్: ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది. జిల్లాలోని 11 బస్టాండ్లలో ఖాళీగా ఉన్న దుకాణాలకు సకాలంలో టెండర్లు నిర్వహించకపోవడంతో భారీగా ఆదాయం తగ్గిపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల కాలంలో కేవలం ఒక సారి మాత్రమే టెండర్లు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న బస్టాండ్లలో 476 దుకాణాలు ఉండగా అందులో 80కిపైగా దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక్క తిరుపతి డిపోలోనే 20కిపైగా దుకాణాలు ఖాళీగా ఉండడం గమనార్హం. అలాగే స్కూటర్ స్టాండ్ కూడా ఖాళీగా ఉంది. దీనిపై తిరుపతి బస్టాండ్ ఏటీఎం డీఆర్ నాయుడు మాట్లాడుతూ అన్ని దుకాణాలకు టెండర్లు నిర్వహిస్తామన్నారు.
నేడు పెంచలకోనలో బ్రహోత్సవాలపై సమీక్ష
రాపూరు: మండలంలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాలపై మంగళవారం నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిణి అనూష ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఏసీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మే 9 నుంచి 14వ తేదీ వరకు నృసింహుని బ్రహోత్సవాలు జరగనున్న నేపథ్యంలో వివిధ శాల అధికారులతో సమీక్షించనున్నట్టు పేర్కొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 104 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 95 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్‌న్ రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
భూసేకరణ వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: వైజాగ్–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ పెండింగ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ శుభం బన్సల్‌తో కలసి ఆయన అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు సమన్వయంతో భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు. రెవెన్యూతోపాటు ఏపీఐఐసీ, ఆర్‌అండ్‌బీ శాఖలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అలాగే నాయుడుపేట, మేనకూరు మండలాలకు సంబంధించిన ఏడు గ్రామాలలో భూ సేకరణ పెండింగ్లో ఉందన్నారు. తిరుపతి ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మధుసూదన్‌రావు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
ఈనెల 25న జరగనున్న ప్రపంచ మలేరియా దినోత్సవం పోస్టర్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్‌తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప్‌కుమార్, వైద్యాధికారులు ఆనంద మూర్తి, బాబూ నెహ్రూరెడ్డి పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 7 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,746 మంది స్వామివారిని దర్శించుకోగా 25,078 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.85 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకె న్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది.

ఆర్టీసీ ఆదాయం ‘ఖాళీ’

ఆర్టీసీ ఆదాయం ‘ఖాళీ’