
గురుమూర్తి మృతిపై దర్యాప్తు ముమ్మరం
నాయుడుపేటటౌన్ : ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన టీడీపీ నేత ఎల్లు గురుమూర్తి(52)ని అదే పార్టీలోని ప్రత్యర్థులే చంపించినట్లు పోలీసులకు మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు సైతం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురుమూర్తి బైక్‌ను వాహనం ఢీకొన్న వాహనం ఆయన ప్రత్యర్థులదని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. వాహనంలో ఐరన్‌రాడ్‌తో పాటు గ్లౌజులు లభించడంతో ఇది హత్యే అని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనిపై సీఐ బాబీని వివరణ కోరగా.. గురుమూర్తి కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
29ఎస్‌ఎల్‌పి66ః వాహనంలో ఐరన్ రాడ్, గ్లౌజులు
ఘనంగా నృత్య దినోత్సవం
చంద్రగిరి : అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా మంగళవారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. బుధవారం సైతం శ్రీకృష్ణ నటరాజాలయం ఆధ్వర్యంలో నృత్య దినోత్సవ నిర్వహించనున్నారు. సుమారు 10 నృత్య అకాడమీలకు చెందిన కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం ఏఓ సుధాకర్ కళాకారులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.