రైతుల పక్షాన పోరాడుతాం
ఐదేళ్లుగా పెండింగ్‌లోనే..! కొడంగల్ నియోజకవర్గంలో ఐదేళ్లక్రితం మంజూరైన కమ్యూనిటీ భవనాలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
8లోu
9లోu
పరిగి: లగచర్లలో అధికారులపై దాడికి పాల్పడ్డ వ్యవహారంలో జైలు పాలైన రైతులను పరామర్శించడానికి గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విచ్చేశారు. ఈ క్రమంలో లగచర్ల, రోటిబండతండా, పులిచర్లగుంటతండాలకు వెళ్తుండగా సీపీఎం నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టణ కేంద్రంలోని కోర్టు పక్కన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య ఎర్ర టవాల కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. ప్రభుత్వం 46 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టి గ్రామాల్లోని ప్రజలను భయభ్రాంతుకు గురిచేయడం సరికాదన్నారు. సీపీఎం పార్టీ రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, హబీబ్, సత్తయ్య, మహిపాల్‌రెడ్డి, రఘురాం, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టులు
లగచర్లకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రైతుల పరామర్శకు రానుండటంతో ఉదయం నుంచి వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సీపీఎం, సీపీఐ, ఇతర కమ్యునిస్టు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకొని విడుదల చేశారు. అనంతరం వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. రైతులను అన్యాయం జరుగుతుంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. సీఎం సొంత నియోజవర్గంలోని సమస్యలను పరిష్కరించుకోని ప్రభుత్వం.. రాష్ట్రంలో ఎలా పరిష్కరిస్తుందని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం అరెస్టులను ఆపి రైతులను విడుదల చేసి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
రైతుల పక్షాన పోరాడుతాం
Comments
Please login to add a commentAdd a comment