● జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి డీబీ శీతల్
అనంతగిరి: లైంగిక వేధింపులపై మహిళలలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి డీబీ శీతల్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లైంగిక వేధింపులు, మహిళల హక్కులపై వివిధ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో మహిళలకు అనేక హక్కులు కల్పించారని, వాటిపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లయితే అంతర్గత, స్థానిక ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయాలన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, సాంఘిక మాధ్యమాల్లో అసభ్య మెసేజ్, పోస్టులు చేయడం, వీడియోలు పంపడం, వీడియో కాల్ చేయడం,స్క్రీన్ షాట్లు పోస్ట్ చేయడం వంటివి కూడా లైంగిక వేధింపుల చట్టం పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. దురుద్దేశంతో ఫిర్యాదు చేస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, కలెక్టరేట్ ఏవో ఫర్హీన్, లీగల్ ఎయిడ్ బార్ కౌన్సిల్ సభ్యులు టి.వెంకటేష్, రాము, శ్రీనివాస్, ప్యానెల్ అడ్వకేట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment