
సెక్యూరిటీగార్డు ఆత్మహత్యాయత్నం
తాండూరు టౌన్: పురుగు మందు తాగి ఓ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నర్సింలు 20 ఏళ్లుగా స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వినాయాక ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఏజెన్సీ నిర్వాహకులు నెల నెల జీతాలు సరిగా చెల్లించక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం పెండిగ్‌లో పెట్టిన జీతంతో పాటు పీఎఫ్‌ను వెంటనే జమచేయాలని ఏజెన్సీ నిర్వాహకుడిని కోరగా అతడు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన నర్సింఉలు పురుగు మందుతాగాడు. గమనించిన స్థానికులు యాన్ను హుటాహుటిన తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా కుటుంబ సభ్యులు ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.
పెండింగ్ పీఎఫ్, ఈఎస్‌ఐ జమచేయండి
ఔట్ సోర్సింగ్ విధానంలో జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ కేర్ స్వీపర్‌లకు జీతాలు సరిగా ఇవ్వకుండా, పీఎఫ్ జమచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వినాయక ఏజెన్సీ తీరుకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. పెండింగ్‌లో పెట్టిన పీఎఫ్, ఈఎస్‌ఐని వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వారికి రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలన్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వినాయక ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలన్నారు.
వేతనాలు పెండింగ్‌లో పెడుతున్న వినాయక ఏజెన్సీపై చర్యలకు డిమాండ్
సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన

సెక్యూరిటీగార్డు ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment